కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలను గుర్తిస్తాం..
సోషల్ మీడియాలో వచ్చిన కమిటీలు వాస్తవం కాదు….
జనగామ డిసిసి ఉపాధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి…
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
కాంగ్రెస్ పార్టీ లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తించి పదవులు ఇచ్చి వారికి గౌరవం అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని జనగామ డిసిసి ఉపాధ్యక్షులు నూకల బాల్ రెడ్డి అన్నారు. జనగామ డిసిసి అధ్యక్షురాలు లకావత్ ధన్వాంతి లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు వారు ప్రకటన ద్వారా మాట్లాడారు. జనగామ జిల్లాలో పట్టణ, మండలాల కమిటీల వివరాలను మండలంలో ఉన్న నాయకులు కార్యకర్తలతో చర్చించి న తరువాతనే కమిటీలను డిసిసి అధ్యక్షురాలు లకావత్ ధన్వాంతి లక్ష్మీనారాయణ ప్రకటిస్తారని అన్నారు. నిన్నటి రోజు సోషల్ మీడియాలో వచ్చిన కమిటీ పేపర్లలో ఎలాంటి వాస్తవం లేదని, త్వరలో పూర్తి కమిటీలను ప్రకటించడం జరుగుతుందని తెలియజేశారు. పార్టీ కోసం బలోపేతం కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తించి అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.











