దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి
బహుజన శ్రామిక యూనియన్ కోఆర్డినేటర్ సురుపంగ శివలింగం
యాదాద్రి భువనగిరి. మే 10. ప్రజా గొంతుక ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట మండలం సూరారం గ్రామంలో ఈనెల 7వ తారీకు రోజున దళితులైనటువంటి వారు కోట మైసమ్మగ్రామ దేవతకు బోనాలు పెట్టడానికి వెళితే అడ్డుకోవడం ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తేమాపైనే ప్రశ్నిస్తారని దాడులు చేయడం స్వాతంత్రం వచ్చి 76 77 సంవత్సరాలు నడుస్తున్నప్పటికీ నేటికీ కుల వివక్షతకొనసాగుతుందంటే అధికారులు పోలీసులు ఇలాంటి వారిపై విచారణ జరిపి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని దళిత బహుజన శ్రామిక యూనియన్ కోఆర్డినేటర్ సురపంగ శివలింగం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి తిరుమలేష్ సిటిజన్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బానోతు భాస్కర్ నాయక్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటికలదేవేందర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు











