*రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కువారిని*
*-స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ ని*
*-మంత్రి కొండ సురేఖను*
*-మర్యాదపూర్వకంగా కలిసిన గద్వాల నియోజకవర్గ ఇన్చార్జ్ సరిత తిరు పతయ్య.*
నేడు హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వారిని, అలాగే శాసనసభ స్పీకర్ శ్రీగడ్డం ప్రసాద్ ని, జెడ్పీ మాజీ చైర్పర్సన్ మరియు గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిసరితతిరుపతయ్యమర్యాదపూర్వకంగా కలిశారు.తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌గా తనను నియమించినందుకు గాను, ఉప ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే కొండ సురేఖ మంత్రి వారికి మరియు శాసనసభ స్పీకర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకంతో ఇంతటి కీలక బాధ్యతను అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మరియు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గద్వాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, సమాఖ్య ద్వారా రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న కులవృత్తిదారుల సంక్షేమానికి శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొ న్నారు. త్వరలోనే బాధ్యతలు స్వీకరించి ప్రజా సేవలో నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు.











