*ఘనంగా ప్రహ్లాద రావు వివాహ వార్షికోత్సవ వేడుక…
జోగులాంబ గద్వాల జిల్లా ఆది శిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వ్యవస్థాపక వంశీయుడు శ్రీ కృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు పద్మావతమ్మ దంపతుల 50వ వివాహ వార్షికోత్సవ వేడుక ఆయన స్వగృహంలో అభిమా నులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. ఆలయ ఈవో సత్య చంద్రారెడ్డి గ్రామ సర్పంచ్ చిట్టెమ్మ గోపాల్ ప్రహ్లాద దంపతులకు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్ర మంలో చంద్రశేఖర రావు మాజీ సర్పంచ్ నరేందర్ ఉప్పరి నారాయణ రవి గౌడ్ మనోహర్ శ్రీనివాసులు వీరారెడ్డి దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 26











