చర్ల మండలంలో ఘనంగా శ్రీ హనుమాన్ జయంతి
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పరిధిలో గల దేవస్థానాలలో శ్రీ శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ పూజలు.అభిషేకాలు జరిగాయి.చర్ల కేంద్రంలో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా చర్ల మండలం ధర్మరక్షణ సమితి ఆధ్వర్యంలో పెందుర్తి ఆంజనేయులువరలక్ష్మి దంపతుల ఇంటి వద్ద హనుమాన్ చాలీసా పారాయణం.చిన్న ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో తంగళ్ళపల్లి శంకరాచారి ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పఠనం చేయడం జరిగినది.అనంతరం పురవీధుల గుండా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా తిరిగారు. ఈ కార్యక్రమంలో ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దేవాలయ కమిటీ సభ్యులు.చర్ల మండల ధర్మ రక్షణ కమిటీ సభ్యులు.చర్ల మండల భక్తులు.తదితరు పాల్గొన్నారు.
Post Views: 201











