పేద వాడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం…..
వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:15 హాలియా మున్సిపాలిటీ 6వ వార్డులో తక్కేలపల్లి కృష్ణ – మహేశ్వరి దంపతులు నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్ వారు మాట్లాడుతూ దళిత కుటుంబానికి చెందిన తక్కెలపల్లి కృష్ణ కుటుంబం ఎన్నో ఏళ్ల నుంచి సొంత ఇల్లులేక ఎంతో ఇబ్బంది పడుతుంటే గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన ఆయన కల నెరవేర లేదని,కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వీరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరిగిందని ,కాంగ్రెస్ ప్రజా పాలనలో మరెన్నో ఇందిరమ్మ ఇళ్లు లు లబ్ధిదారులకు చేరేలా చేసి ప్రతి పేదవాడి ఇంటి కల నెర వేరేలా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆయన అన్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ, రేవంత్ రెడ్డికి,స్థానిక శాసనసభ్యులు గౌ,, జయవీర్ కి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు 6వ వార్డు కౌన్సిలర్ బొంగరాల యేసు రాజు, 9 వ వార్డు కౌన్సిలర్ చెరుపల్లి ముత్యాలు,2వ వార్డు కౌన్సిలర్ సలహాదారులు నకిరేకంటి సైదులు, శోభన్, తదితరులు పాల్గొన్నారు..











