ముమ్మరంగా చెక్ పోస్టు వద్ద తనిఖీలు
అక్రమంగా తరలిస్తున్న పశువులను పట్టుకున్న పోలీసులు…
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం “వధ” నిమిత్తం అక్రమంగా తరలిస్తున్న 2 మగ దూడలను మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన (బక్రీద్) చెక్‌పోస్ట్ వద్దబచ్చన్నపేట పోలీసులు పట్టుకున్నారు. బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం బచ్చన్నపేట పశువుల సంతకు వచ్చి, 2 మగ దూడలను పశువులను వధించేందుకు తరలిస్తున్న క్రమంలో ఎలాంటి చెల్లుబాటు అయ్యే అనుమతులు లేకుండా అక్రమంగాతరలిస్తుండగా పట్టుబడ్డారు. నిందితులు మద్దూరు మండలానికి చెందిన ఆరిఫ్, కనకయ్య, వెంకటేష్ (డ్రైవర్), అబ్దుల్ వజీద్ (పరారీలో), షన్ను (పరారీలో).ఈ మేరకు కేసు నమోదు చేయబడుచున్నది. ఎలాంటి అనుమతులు లేకుండా పశువులను తరలించడం నేరం. అటువంటి కార్యకలాపాల గురించి ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే పోలీసు వారికి తెలియజేయగలరు అని అన్నారు.











