E-PAPER

డీడీఎన్ అర్చకులకు శీఘ్ర దర్శనం.. ప్రభుత్వ ఉత్తర్వులపై హర్షం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

డీడీఎన్ అర్చకులకు శీఘ్ర దర్శనం.. ప్రభుత్వ ఉత్తర్వులపై హర్షం

20 May 2026, 12:46 pm DISHA POWER

డీడీఎన్ అర్చకులకు శీఘ్ర దర్శనం.. ప్రభుత్వ ఉత్తర్వులపై హర్షం

ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మండల డి.డి.ఎన్.ఎస్ అధ్యక్షులు సదానిరంజన్ సిద్ధాంతి

ప్రజా గొంతుక,ఎల్కతుర్తి, మే 20 తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ధూప దీప నైవేద్య (డీడీఎన్) అర్చకులకు ప్రధాన దేవాలయాల్లో శీఘ్ర దర్శనం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై అర్చక వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు హనుమకొండ సహాయ కమీషనర్ రాముల సునీతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.డీడీఎన్ అర్చకులకు శీఘ్ర దర్శనం కల్పించడం ద్వారా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో వేగంగా దర్శనం చేసుకునే అవకాశం కలిగిందని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా డీడీఎన్ పథకం కింద పనిచేసే అర్చకులు ఇతర ఆలయాలకు వెళ్లినప్పుడు సాధారణ భక్తులతో పాటు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, దీనివల్ల వారు నిర్వహిస్తున్న ఆలయాల్లో నిత్య పూజా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతోందన్నారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రత్యేక క్యూలైన్ల ద్వారా త్వరితగతిన దర్శనం పూర్తి చేసుకుని తిరిగి తమ ఆలయాలకు చేరుకునే అవకాశం ఏర్పడిందని తెలిపారు. దీంతో ధూప దీప నైవేద్య పథకం అమలు మరింత సమర్థవంతంగా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు.దేవాదాయ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా డీడీఎన్ అర్చకులకు ఈ సౌకర్యం వర్తించనుంది. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 458 మంది డీడీఎన్ అర్చకులు ఉన్నట్లు సమాచారం.ఈ సందర్భంగా ఎల్కతుర్తి మండల డి.డి.ఎన్.ఎస్ అర్చకుల తరఫున మంత్రి కొండా సురేఖ, కమిషనర్ హనుమంతరావు,హనుమకొండ జిల్లా సహాయ కమీషనర్ రామల సునీతలకు సదానిరంజన్ సిద్ధాంతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!