వివాహ దినోత్సవ సందర్భంగా మజ్జిగ పంపిణీ చేసిననర్సింగ్ ఎల్లేష్ స్వప్న దంపతులు
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామ ఉపాధ్యక్షుడు నర్సింగ్ ఎల్లేష్ స్వప్న దంపతుల 21వ వివాహ దినోత్సవ సందర్భంగా దుర్గామాతను దర్శించుకుని, ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు, హమాలీలకు, మహిళలకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాహ దినోత్సవ సందర్భంగా ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేయాలని నిర్ణయించుకొని, మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఎండలో పనిచేస్తున్న వారికి మజ్జిగ అందించడం వారికి దాహార్తి తీర్చిన వారం అవుతామని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోక్కలకొండ బాబు, నర్మెట్ట బాలరాజు, మహిళలు, రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 29











