నూతన బస్సు సర్వీసు ను ప్రారంభించిన సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఇజ్జగిరి రాములు..
ప్రజా గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలంలోని బండ నాగారం గ్రామము నుండి జేబీఎస్ కు నూతన జనగాం డిపోకు చెందినఆర్టీసీ బస్సును సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఇజ్జగిరి రాములు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు ఆర్టీసీ సౌకర్యం అందించాలనే సంకల్పంతో బండ నాగారం నుండి 8 గంటలకు బయలుదేరి వయా చేర్యాల దుద్దెడ నుండి జేబీఎస్ కు చేరుకుని అక్కడ నుండి తిరిగి 3 గంటలకు బయలుదేరి బండ నాగారం నుండి జనగామ కు చేరుకుంటుంది. ఉదయం 5.30 గంటలకు జనగామ వయ బండనాగారం టూ చెరియల్ దుద్దెడ క్రాస్ నుండి సికింద్రాబాద్ కు నూతన బస్సు సర్వీస్ ప్రారంభం తిరిగి 3 గంటలకు సికింద్రాబాద్ నుండి వయ బండ నాగారం మీదుగా జనగామకు చేరుకుంటుంది.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మానేపల్లి మల్లయ్య, కొల్ల నర్సిరెడ్డి, ఇప్ప శ్రీధర్ రెడ్డి, ఇజ్జగిరి నరేష్, జంగిలి స్వామి, ఇజ్జగిరి పరుశురాములు, చల్ల రమేష్ రెడ్డి, ఏళ్ల చంద్రారెడ్డి, రా పెళ్లి జనార్ధన్, దామెర సురేష్, తదితరులు గ్రామ ప్రజలకు పాల్గొన్నారు.











