చేనేత హక్కుల సాధన సభ ను జయప్రదం చేద్దాం..
-పిలుపునిచ్చిన చేనేత సంఘం నాయకులు.
జోగులాంబ గద్వాల జిల్లా మే 22 (ప్రజా గొంతుక): జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం నందు పద్మశాలి కళ్యాణ మండపం లో చేనేత సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ తేదీ 25-5- 2026 సోమవారం రోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ మరియు బిసి మేధావుల ఫోరం ఆధ్వర్యంలో జరిగే చేనేత హక్కుల సాధన సభకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయ కులు మాట్లాడుతూ ఈ సభ ము ఖ్య ఉద్దేశం అంతరించిపోతున్న చేనేత పరిశ్రమను కాపాడాలని చేనేత కార్మికులకు ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు ప్రవే శపెట్టి చేయూతను అందించాలని నడిగడ్డ ప్రాంతము నందు ఉన్నటు వంటి చేనేత కార్మికుల సమస్య లను ప్రభుత్వం దృష్టికి తీసుకె ళ్లేందుకు ఈ సభను నిర్వహిస్తు న్నామని తెలిపారు ఇట్టి సభకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు మాజీ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మె ల్యేలు చేనేత సామాజిక వర్గం ప్రజాప్రతినిధులు మాజీ ఐఏఎస్ టి చిరంజీవి, తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర,మోహన్, తదితర ముఖ్య నాయకులు అందరూ విచ్చేస్తున్నారు కావున జిల్లాలో ఉండే చేనేత కార్మికులందరూ విధిగా ఈ సభకు విచ్చేసి సభను విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగింది ఇట్టి కార్యక్ర మంలో తెలంగాణ చేనేత ఐక్యవే దిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం రామకృష్ణ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అక్కల రమా సాయి బాబా తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ శ్రీ రామ లింగేశ్వర కాంళ్లే గారు 21వ వార్డ్ కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్ గారు గద్వాల మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ మహంకాళి కరుణాకర్ గారు జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు తిరుమల త్యాగరాజు గారు మాజీ ఆప్కో డైరెక్టర్ దామ వీరన్న గారు కోట నరసింహులు పద్మశాలి సేవా సంఘం కార్యదర్శి చిలివేరి సాయిబాబా యువజన సంఘం అధ్యక్షుడు అక్కల కుమార్ కాడిగి రాము మాకం బాలరాజ్ ప్రియదర్శిని మహిళా సంఘం అధ్యక్షురాలు బుధార్పు సత్యమ్మ గారు మతక గౌరీ స్వకులశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గచ్చు మల్లికార్జున్ సహాయ కార్యదర్శి సాక్రే సురేష్ మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ సభ్యులు పగుడాకుల సత్యం నీలి శంకర్ సిలివేరి సురేష్ నీలి వెంకటస్వామి చిన్ని నాగరాజు పగడాకుల గోపాల్ కొంకతి ఆంజనేయులు పోతు భీమేష్ పగడాకుల శంకర్ ఆనందు వెంకటేశు వీరేషు వీరన్న ఏరువా జనార్ధన్ పగడాకుల నారాయణ బుదార్పు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.











