*కేటి దొడ్డి మండల వనరుల కేంద్రానికి చేరిన ఉచిత నోట్ పుస్తకాలు.*

*జోగులాంబ గద్వాల జిల్లా మే 22 ( ప్రజా గొంతుక):*
జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి, మే 22ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2026-27 విద్యా సంవత్స రానికి సంబంధించి విద్యార్థులకు పంపిణీ చేసే ఉచిత నోట్ పుస్తకా లు కేటి దొడ్డి మండల వనరుల కేంద్రానికి సురక్షితంగా చేరుకు న్నాయి.వేసవి సెలవుల అనం తరం జూన్ 12వ తేదీన పాఠశా లలు పునఃప్రారంభం కానున్నాయి. స్కూళ్లు తెరిచే నాటికే విద్యార్థు లకు పుస్తకాలు అందించాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా, ఈ నోట్ పుస్తకాలు చాలా సకాలంలో మండల కేంద్రానికి చేరుకోవడం విశేషం “పాఠశాలలు ప్రారంభ మయ్యే మొదటి రోజే విద్యార్థు లకు ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం.” అని అధికారు లు తెలిపారు.ఈ నోట్ పుస్తకాల పరిశీలన మరియు అప్పగింత కార్యక్రమంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ( సి ఆర్ పి ఎస్ ) శివరాజ్ పాపయ్య వారు పాల్గొని పుస్తకాల స్టాక్‌ను తనిఖీ చేశారు. పాఠశాల లు ప్రారంభమైన వెంటనే విద్యార్థు లందరికీ వీటిని సకాలంలో అందే లా చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.











