ప్రతి మండల కేంద్రాలలో వరి జొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి:
*-వడ్డేపల్లి మండల బిజెపి అధ్యక్షులు బోయనాగరాజు*
*జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి మే 23 ( శనివారం):నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశానుసారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రం శాంతిన గర్ పట్టణంలో వడ్డేపల్లి తాసిల్దార్ శివకుమార్సార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వడ్డేపల్లి మండల బిజెపి అధ్యక్షులు బోయనా గరాజు మాట్లాడుతూతక్షణమే వడ్డేపల్లి మండల కేంద్రంలో వరి జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు రైతుల నుండి ధాన్యాన్ని సేకరిం చాలని కోరారు రైతులు ఎంతో కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి నెలలు గడుస్తుందని తెలిపారు గతంలో మొక్క జొన్న కొనుగోలు కేంద్రంలో జరిగిన పొరపాటులను సరిదిద్దుకొని కొనుగోలు కేంద్రం లొ మౌలిక వసతులను ఏర్పాటు చేసి తరుగు తేమ లాంటి అంశాలను ప్రామాణికంగా తీసుకోకుండా దళారుల దోపిడీలనునిర్మూలించడానికి కృషి చేయాలన్నారు మెదక్ మహబూబ్నగర్ ఖమ్మంజిల్లాలలో ఇప్పటికీ మొక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేయకపోగా ధాన్యాన్ని సేకరించడంలో ప్రభుత్వం విఫలమైందని దాని ద్వారా రైతులు రోడ్డెక్కే పరిస్థితి అక్కడ ఉన్న కొనుగోలు కేంద్రాలకు తాళాలు వేసి ధర్నా చేసే పరిస్థితి వచ్చిందని తెలిపారు అలాగే ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత గని బ్యాగుల కొరత ఎక్కువగా ఉందని సేకరించిన ధాన్యాన్ని వెంటనే లారీలకు లోడ్ చేసి గోడౌన్లకు తరలించాలని తెలిపారు రైతు దాదా పుగా3 నెలల 15 రోజులుకష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి దాదాపుగా 2 నెలల సమయం పడుతుం దని దాని ద్వారా రైతులు ఆర్థిక ఇబ్బం దులకు కుటుంబ ఖర్చులను మోయలేని పరిస్థితి వస్తుందన్నారు పిల్లల చదువు లకుఆర్థికంగాఇబ్బందిపడుతున్నారనిసేకరించిన ధాన్యానికి ఒకటి నుండి రెండు వారాలలోపు డబ్బులను రైతులఅకౌంట్లో వెంటనే జమ చేయాలని వడ్డేపల్లి మం డల బిజెపి అధ్యక్షులు బోయ నాగరాజు డిమాండ్ చేశారు రైతుల పక్షాన ఎప్ప టికీ భారతీయ జనతా పార్టీ పోరాడ టానికి ముందు ఉంటుందని ఈ సంద ర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పైపాడు వెంకటేశ్వర్లు జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దూర్ అశోక్, మాజీ మండల అధ్యక్షులు నరసింహ మండల ప్రధాన కార్యదర్శి,రాఘవేంద్ర బుడమ ర్స్ మద్దిలేటి,రామాపురం రోషి రైతులు తదితరు బిజెపి కార్యకర్తలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.











