మంటలో మామిడి తోట దగ్ధం.. కోట్లలో నష్టం ప్రభుత్వ పరంగా ఆదుకోవలంటున్నా బాధిత రైతు…
ప్రజా గొంతుక( మే 30 ) కాల్వ శ్రీరాంపూర్ : మండల కేంద్రంలోని శ్రీరాంపూర్ కొత్తచెరువు ఏరియా ప్రాంతంలోని పుప్పాల విక్రమసింహారావుకు చెందిన 10 ఎకరాల మామిడి తోటలో, సుమారు 60 చెట్లు అగ్నికి అహుతి అయిపోయాయి, మామిడికాయలు కాలి బూడిద అయిపోయాయి. చేతికి అందివచ్చిన పంట కళ్ళముందే కాలిపోవడంతో రైతు కుటుంబం కన్నీటి పర్వతమయ్యారు.బాదిత రైతు తెలిపిన వివరాల ప్రకారం 10 ఎకరాల మామిడి తోట ప్రాంతంలోని చుట్టూ పక్కల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు వరి కోయ్యలకు మంటలు అంటించడంతో, వరి పంట పొలాల అవశేషాలకు నిప్పు పెట్టగా వేగంగా వ్యాపించి మంటలు గాలి వేగంతో మామిడి తోటలోకి చొచ్చు కెళ్లాయని, పది ఎకరాల మామిడి తోటలో సుమారు 60 చెట్లు కాలిపోయాయని రైతు వాపోయాడు. ఒక చెట్టుకు సుమారు 40 వేల రూపాయల నుంచి 50 వేలకు నష్టం వాటిలిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల వారి రైతులతో కలిసి మంటలు ఆర్పేందుకుప్రయత్నించినప్పటికీ,మంటలు తీవ్ర రూపం దాల్చడంతో అదుపు చేయడం కష్టమైందిని, అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది అని వారు వాపోయారు.కోట్లలో నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని, గ్రామస్తులు రైతు సంఘం నాయకులు, బాధిత రైతులు వేడుకున్నట్లు తెలిపారు.











