నేడు సూర్యాపేటలో ఉమ్మడి నల్లగొండ జిల్లా చెస్ సెలక్షన్స్
ప్రజా గొంతుక న్యూస్,(మే30) సూర్యాపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లా చెస్ సెలెక్షన్స్ -2026
అండర్ 9,15. బాల, బాలికలకు చెస్ సెలెక్షన్స్ నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి, గండూరి కృపాకర్, ఎల్, సతీష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి చెస్ సెలెక్షన్స్ బాల, బాలికలకు స్థానిక (టి. టి. డి )కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన వారిని హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పంపించబడతారని షీల్డ్స్, ప్రశంసా పత్రాలు అందిఇస్తామని వారు తెలిపారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లా చదరంగం క్రీడాకారులు ఉపయోగించుకోవాలని వారు కోరారు. వివరాలకు ఎల్, సతీష్ కుమార్ కార్యదర్శి, చరవాణి నెం. 9394753343 సంప్రదించాలని కోరారు.











