బెలిదె శ్రీనివాసులు గెలుపును కాంక్షిస్తూ బైక్ ర్యాలీ
ప్రజా గొంతుక న్యూస్,(మే30) సూర్యాపేట: ఆదివారం రవి మహల్ లో జరిగే సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష ఎన్నికల్లో బెలిదే శ్రీనివాస్ లు ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఆర్యవైశ్యులు బైక్ ర్యాలీ ని జిల్లా కేంద్రంలో శనివారం పోస్ట్ ఆఫీస్ వద్ద ప్రారంభమై పీఎస్ఆర్ సెంటర్, వాణిజ్య భవన్, ఖమ్మం క్రాస్ రోడ్, కొత్త బస్టాండ్ కుడ కుడ రోడ్, కూరగాయల మార్కెట్, నిర్మల హాస్పిటల్ రోడ్ వరకు ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో పలు వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా బెలిదే శ్రీనివాస్ లు మాట్లాడుతూ తనను గెలిపిస్తే అందరివాడుగా ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తానని మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు తూచ తప్పక అమలు చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. తనను ఒక్కసారి ఆశీర్వదించి గెలిపిస్తే సేవ చేసి చూపిస్తానని అన్నారు. కర్మకాండల భవనము ఏర్పాటు కు,పేద ఆర్యవైశ్యులు, పేద విద్యార్థుల ను ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధి కి కృషి చేస్తానని పేర్కొన్నారు. బైక్ ర్యాలీలో రాచకొండ శ్రీనివాస్, గుండా (సుమన్) వెంకన్న, మిట్టపల్లి రమేష్, బికుమల్ల కృష్ణ, ఉప్పల శ్రవణ్ కుమార్, బొల్లం సురేష్, బోనగిరి కృష్ణ, సోమ వెంకన్న, సోమ ప్రవీణ్, పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు పాల్గొన్నారు











