అరైవ్ అలైవ్ ప్రోగ్రాం రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలి: బచ్చన్నపేట ఎస్హెచ్ఓ శ్రీకాంత్
అవగాహన సభకు యువకులను తరలించిన ఎస్సై శ్రీకాంత్
దిశ పవర్ బచ్చన్నపేట మండలంయువత రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షిత ప్రయాణాలు చేయాలని బచ్చన్నపేట ఎస్హెచ్ఓ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్‌లో అడిషనల్ డీజీపీ పాల్గొంటున్న నేపథ్యంలో, బచ్చన్నపేట మండల కేంద్రం నుండి యువత పెద్ద ఎత్తున జనగామకు తరలివెళ్లారు. ఎస్హెచ్ఓ శ్రీకాంత్ ఆధ్వర్యంలో యువకులను జనగామలోని మాంగళ్య ఫంక్షన్ హాల్‌కు తరలించారు.ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ శ్రీకాంత్ మాట్లాడుతూ.. సమాజంలో యువత రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రయాణాల్లో భాగంగా సురక్షితంగా రోడ్డు దాటడం, తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని పేర్కొన్నారు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టంతో పాటు ఆయా కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని ఎస్హెచ్ఓ శ్రీకాంత్ సూచించారు.











