రైతు ముఖంలో ఆనందం.. లక్ష్మాపురంలో విజయవంతంగా వడ్ల కొనుగోళ్లు! సర్పంచ్ నూకల కల్పన రాజిరెడ్డి
దిశపవర్,బచ్చన్నపేట:ఆరుగాలం స్వేదం చేసిన , పండించిన పంట చేతికొచ్చే వేళ రైతు కళ్లల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని లక్ష్మాపురం సర్పంచ్ నూకల కల్పన రాజిరెడ్డి అన్నారు. లక్ష్మాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని విజయవంతంగా ముగించినట్లు ఆమె ప్రకటించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అన్నదాతలు ఎంతో కష్టపడి పండించిన ప్రతి గింజకూ ప్రభుత్వం మద్దతు ధర కల్పించిందని తెలిపారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు, తూకాల్లో మోసాలు జరగకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేశామన్నారు. దళారుల బెడద లేకుండా, సకాలంలో వడ్లను కొనుగోలు చేసి నేరుగా రైతుల ఖాతాల్లోకే సొమ్ము జమ అయ్యేలా చూడటం హర్షణీయమన్నారు. వడ్ల కొనుగోలు విజయవంతం కావడానికి సహకరించిన పీఏసీ అధికారులు, సిబ్బంది, రైతు సోదరులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిడుగు మహేష్, సెంటర్ నిర్వాహకుడు భూపాల్ రెడ్డి, రైతులు నూకల రాజిరెడ్డి, నూకల కృష్ణారెడ్డి, నూకల దేవేంద్ర, నూకల జ్యోతి,శివరాత్రి శ్రీకాంత్,పిడుగు ఉపేందర్, శివరాత్రి శ్రీనివాస్,హమాలీలు ఇజ్జగిరి భాస్కర్, ఇజ్జగిరి శ్రీనివాస్, బుసరాజు బాలయ్య,ఈదులకంటి ప్రభాకర్ రెడ్డి, మానేపల్లి దయాకర్,మానేపల్లి ప్రకాష్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.











