రైతుల పాలిట శాపంగా మారిన యూరియా యాప్‌ను రద్దు చేయాలి
దిశ పవర్ బచ్చన్నపేట మండలం ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల కష్టాలు పట్టవా అని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఫేర్రోజ్ భాయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలకుల తీరుపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ సభల భయంతోనే తప్ప, రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ రైతు భరోసా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. తక్షణమే ఇళ్లకు అవసరమైన మట్టి, ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నడ్డి విరుస్తున్న యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని, రైతులకు సరిపడా ఎరువులు ఇవ్వలేని ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఈదులకంటి ప్రతాపరెడ్డి, మాజీ సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, ఉపసర్పంచ్ రజిత వెంకటేష్, పిఎసిహెచ్ డైరెక్టర్ చందు, వార్డు మెంబర్లు శివరాత్రిరాజు ,గంధమల్ల మాధవి మహేష్, మల్లేశం, ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి వేణుగోపాల్, గోపిరెడ్డి, మున్నాభాయ్, మచ్చ సతీష్ ,అనిల్, తమ్మడపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు సిద్ధారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.











