దిశ పవర్ జనగామ నియోజకవర్గం విధి నిర్వహణలో ఉన్న RTV ప్రతినిధి గొల్లపెల్లి వెంకటరత్నంపై జరిగిన దాడిని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-IJU) జనగామ జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. యశ్వంతాపూర్ సమీపంలో జరిగిన లారీ ప్రమాదంపై గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న సమయంలో లారీ యజమాని దురుసుగా ప్రవర్తిస్తూ దాడి చేసినట్లు జిల్లా అధ్యక్షుడు ఇర్రి మల్లారెడ్డి తెలిపారు.ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంటూ, నిందితుడిపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుల భద్రతకు తగిన చర్యలు చేపట్టాలని TUWJ-IJU జిల్లా శాఖ పోలీసులను డిమాండ్ చేసింది.ఈ కార్యక్రమం లో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పార్నంది వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి సురిగల బిక్షపతి,ఓరుగంటి సంతోష్,బొల్లు ఎల్లారెడ్డి, కొత్తపెల్లి కిరణ్,శేషత్వం అనంద్,వంగ శ్రీకాంత్ రెడ్డి, సందెన రమేష్,యండి ఎజాజుద్దీన్,సద్దనపు బాస్కర్,కెమిడి ఉపెందర్,కాసాని ఉపెందర్,జంపాల శ్రీనివాస్, లావు జ్తెపాల్ రెడ్డి, మణి,ఆశీష్,బాబా తదితరులు పాల్గొన్నారు.











