రెండు అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత – డ్రైవర్లు, యజమానులపై కేసులు నమోదు.
దిశ పవర్ బచ్చన్నపేట మండలం,తుర్కపల్లి మండలం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా బచ్చన్నపేట మండలానికి ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను లింగంపల్లి గ్రామం వద్ద ఎస్సై శ్రీకాంత్ తన పోలీస్ బృందంతో కలిసి పట్టుకొని, వాటి డ్రైవర్లు మరియు యజమానులపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంబంధిత అనుమతులు పొందిన తరువాత మాత్రమే ఇసుకను తరలించాలి. అక్రమ ఇసుక రవాణా, నిల్వ మరియు విక్రయాల వంటి కార్యకలాపాలను అరికట్టేందుకు మండల ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అక్రమ ఇసుక రవాణా, నిల్వ, విక్రయాల గురించి ఏవైనా సమాచారం తెలిసిన వెంటనే పోలీసు శాఖకు తెలియజేయాలని కోరారు.
Post Views: 29











