దిశ పవర్ నర్మెట మండలం:వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు పచ్చగా పండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఇప్పలగడ్డ గ్రామ సర్పంచ్ *దారావత్ రాజమణి రాజు నాయక్* గారు గ్రామ మహిళలతో కలిసి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామంలో కొలువైన గ్రామ దేవతలు, దేవుళ్ల ఆలయాల వద్దకు సర్పంచ్ గారు మహిళలతో కలిసి వెళ్లారు. ప్రతి గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి, అమ్మవార్లకు, దేవుళ్లకు నీళ్లు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. వరుణ దేవుడు కరుణించి చల్లని వానలు కురిపించాలని, రైతులకు మేలు జరగాలని, పాడి పంటలతో గ్రామం కళకళలాడాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా సర్పంచ్ రాజమణి *రాజు నాయక్* గారు మాట్లాడుతూ, “వ్యవసాయం ఆధారంగా బతికే మన గ్రామానికి వర్షాలు చాలా ముఖ్యం..అందుకే మన పెద్దలు పాటించిన సంప్రదాయం ప్రకారం గ్రామ మహిళలతో కలిసి దేవతలకు మొక్కులు చెల్లించాం. అమ్మవారి,ఆంజనేయ స్వామి దయతో త్వరలోనే వర్షాలు కురుస్తాయని నమ్ముతున్నాం” అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇట్టబోయిన సురేష్, వార్డు సభ్యులు, ఇట్టబోయిన శ్రీనివాస్,బానోత్ మంజుల బలరాం, అంజయ్య,రాములు, గ్రామ పెద్దలు, ఆశా వర్కర్ ప్రేమలత, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ మహిళలు చిన్నారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.











