బచ్చన్నపేట మండల ఉపసర్పంచ్‌ల ఫోరం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక…
– మండల అధ్యక్షుడిగా తాడెం నరేందర్..
– ప్రధాన కార్యదర్శిగా పిడుగు మహేష్ ఎంపిక..
దిశా పవర్,బచ్చన్నపేట: బచ్చన్నపేట మండలంలోని ఉప సర్పంచ్ల ఫోరం కమిటీని జనగామ జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు పండుగ హరీష్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా తాడం నరేందర్, ప్రధాన కార్యదర్శిగా పిడుగు మహేష్, ఉపాధ్యక్షులుగా బైరి రజిత వెంకటేష్, దూలిమిట్ట పర్శయ్య గౌడ్, కోశాధికారిగా మేడబోయిన నవీన్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ చింతల రాజిరెడ్డి లను నియమించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ… మండల కేంద్రంలోని సమావేశమై పార్టీలకు అతీతంగా ఐక్యంగా కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఉపసర్పంచ్‌ల హక్కుల సాధన, స్థానిక సంస్థల బలోపేతం, గ్రామాభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామపంచాయతీల అభివృద్ధిలో ఉపసర్పంచ్‌ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ నెల 25న తలపెట్టిన హలో ఉప సర్పంచ్ చలో హైదరాబాద్ కార్యక్రమానికి భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులుగా చింతల కర్ణాకర్, జిలకర కుమారస్వామి, చల్ల కమలాకర్, గంగం దయాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర శంకర్ పలు గ్రామాల ఉప సర్పంచ్ లు పాల్గొన్నారు.











