పెట్రోల్ కష్టాలకు చెక్: బచ్చన్నపేటలో వరుణ్ మోటార్స్ ‘ఈవీ’ బైక్ షోరూం ప్రారంభం

* ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి
* రూ. 40 వేల నుంచే ఎలక్ట్రిక్ బైకులు అందుబాటులో ఉన్నాయి: చల్ల సురేందర్ రెడ్డి, చల్ల సత్యలక్ష్మి మరియు సాయి ప్రమోద్ రెడ్డి
దిశ పవర్ బచ్చన్నపేట:మండల ప్రజలందరికీ త్వరలోనే పెట్రోల్ కష్టాలు తప్పబోతున్నాయని వరుణ్ మోటార్స్ ప్రతినిధులు చల్ల సురేందర్ రెడ్డి, సత్యలక్ష్మి అన్నారు. ఆదివారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘వరుణ్ మోటార్స్ ఈవీ బైక్ షోరూం’ను జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ.. నిరంతరం పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడుతున్న మండల ప్రజలకు ఈ ఎలక్ట్రిక్ బైకుల రాక ఒక సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. తమ షోరూంలో వినియోగదారుల కోసం కేవలం రూ. 40,000 ప్రారంభ ధర నుంచే ఈవీ బైకులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ బైకులు ఒక్కసారి ఛార్జ్ చేస్తే మోడల్‌ను బట్టి 60 కిలోమీటర్ల నుండి గరిష్టంగా 150 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయని వివరించారు. సరికొత్త మోడల్స్, ఆకర్షణీయమైన పలు రకాల రంగుల్లో ఇవి లభిస్తాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆల్వాల నర్సింగరావు, కాంగ్రెస్ సర్పంచ్ ఫోరం ప్రతినిధి ఇజ్జగిరి రాములు, మండల అధ్యక్షుడు ఎండి మసూద్, జిల్లా సందీప్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యదర్శి పిన్నింటి కావ్య బాపురెడ్డి, పిన్నింటి నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దత్రపు నరేష్, మానపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.











