దిశ పవర్ జనగామ పట్టణంలోని 22వ వార్డుకు చెందిన చీర సత్తయ్య అకాల మరణం చెందడంతో ఆయన కుటుంబాన్ని జనగామ మునిసిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ పరామర్శించారు. సత్తయ్య గారి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ సత్తయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆపద సమయంలో కుటుంబానికి ధైర్యం చెబుతూ, మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.అనంతరం ఆమె మాట్లాడుతూ.. సత్తయ్య గారి మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని అన్నారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.చీర సత్తయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని భరించే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.











