రాయపర్తి, సెప్టెంబర్ 25 దిశ పవర్ వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంతో పాటు గ్రామంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతుంది, గుంపులు గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు రోడ్లపైకి వచ్చి వాహనదారులు, పాదచారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి, ముఖ్యంగా రహదారిపై ఒక్కసారిగా కుక్కల గుంపులు అడ్డుగా రావడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, రాత్రి వేళల్లో పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని, గుంపులుగా తిరుగుతున్న కుక్కలు వెంట పడడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి సైతం భయపడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు, రాయపర్తిలోని పలు కాలనీలు, వీధుల్లో ఏ వాడ చూసిన కుక్కల గుంపులే కనిపిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు, చున్నారులు, వృద్ధులు రోడ్లపై నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టి ప్రజలకు భయందోళనలు లేకుండా చూడాలని గ్రామస్థులు పాల్గొన్నారు,











