ఇంటి పన్నులు సకాలంలో చెల్లించాలి……

10,11,12వార్డు కౌన్సిలర్స్
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:26
ఇంటి పన్ను వసూళ్లలో 11 వ వార్డు కౌన్సిలర్ డి. ప్రసాద్ బాబు ,10 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు పిల్లి ఆంజనేయులు,12 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు ఎడవల్లి రంజిత్ పాల్గొని ప్రజలకు పన్నులు చెల్లించాలంటూ విజ్ఞప్తి చేశారు హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు (26-03-2026) ఇంటి పన్ను (ప్రాపర్టీ టాక్స్) వసూళ్ల కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, బిల్ కలెక్టర్లు కలిసి పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఇంటింటికి వెళ్లి బకాయిల వసూళ్లను చేపట్టారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి పౌరుడు తమ ఇంటి పన్ను బకాయిలు ప్రస్తుత పన్నులు మరియు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు తక్షణమే చెల్లించాలని కోరారు. పన్నులు సమయానికి చెల్లించడం ద్వారా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతాయని తెలిపారు.
అలాగే,పన్నులు ఆలస్యంగా చెల్లించడం వలన వడ్డీలు (ఇంట్రెస్ట్) విధించబడతాయని, అందువల్ల ప్రజలు సమయానికి పన్నులు చెల్లించి అదనపు భారం నుండి తప్పించుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ ద్వారా చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశుభ్రత,నీటి సరఫరా,వీధి దీపాలు వంటి సేవల మెరుగుదలకు పన్నుల వసూళ్లు కీలకమని పేర్కొన్నారు.
హాలియా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా పన్నులు చెల్లించి సహకరించాలని విజ్ఞప్తి చేయబడింది.











