హైదరాబాద్ – కొత్తగూడెం దూరం తగ్గనుంది
NH 930P భూసేకరణకు గెజిట్ విడుదల!
ప్రజా గొంతుక న్యూస్ మార్చి 30 భద్రాద్రి కొత్తగూడెం:
హైదరాబాద్ నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రయాణ దూరాన్ని తగ్గించే సరికొత్త 4 లైన్ల జాతీయ రహదారి (NH 930P) నిర్మాణంలో కీలక అడుగు పడింది. ఇల్లెందు – కొత్తగూడెం మధ్య భూసేకరణ కోసం కేంద్ర రవాణా శాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ముఖ్య అంశాలు: మార్గం: కొత్తగూడెం ఇల్లెందు క్రాస్ రోడ్డు నుండి ప్రారంభమై.. ఇల్లెందు, మహబూబాబాద్, తొర్రూరు మీదుగా హైదరాబాద్లోని గౌరెల్లి జంక్షన్ వరకు ఈ రహదారి సాగుతుంది. * భూసేకరణ: ఇల్లెందు, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లోని సుమారు 4.85 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. * ప్రయోజనం: ఈ రహదారి అందుబాటులోకి వస్తే హైదరాబాద్ – కొత్తగూడెం మధ్య ప్రయాణ దూరం 40 కిలోమీటర్లు తగ్గనుంది.* రవాణా సౌకర్యం: భద్రాచలం వెళ్లే భక్తులకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, పారిశ్రామిక రవాణా సులభతరమవుతుంది. అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లే వారికి ఇది ఎంతో మేలు చేకూరుస్తుంది.ప్రస్తుతం ఉన్న రెండు వరుసల రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించడం ద్వారా ప్రయాణం మరింత సురక్షితం కానుంది.











