అసైన్డ్ భూముల కబ్జాపై విచారణకు విసికె డిమాండ్
ప్రజా గొంతుక మార్చి 30 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలోని అసైన్డ్ భూముల కబ్జాపై విచారణ జరిపించాలని విసికె ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కన్నాల రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూమిని తరువాత పేదలకు అసైన్ చేయగా, 2015 తర్వాత అందులో కొంత భాగాన్ని ఓ వ్యక్తి ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అనంతరం తన ప్రభావంతోసబ్ నెంబర్లతో తన పేరుపై పట్టాలు పొందినట్లు పేర్కొన్నారు.అసైన్డ్ భూములను ప్రైవేట్ వ్యక్తుల పేర్లకు బదిలీ చేయడం వెనుక రెవెన్యూ అధికారుల పాత్రపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి శాఖాపరమైన విచారణ జరిపించి, పేరు రికార్డుల నుండి తొలగించాలని, జారీ చేసిన పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే అసైన్ చేసిన పేదలకే భూములు తిరిగి ఇవ్వాలని కోరారు. చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు అంబాల అనిల్ హనుమకొండ నగర నాయకుడు తాళ్ల పెళ్లి ప్రవీణ్ జిల్లా నాయకులు గొర్రె అనిల్ తదితరులు పాల్గొన్నారుపాల్గొన్నారు…











