చర్లలో హనుమాన్ విజయోత్సవ భారీ ర్యాలీ
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నేడు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులతో కలిసి శ్రీ హనుమాన్ స్వామికి ప్రత్యేక పూజలునిర్వహించారు. అనంతరం చర్ల మండలంలో సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సనాతన ధర్మ పరిరక్షణ సమితి కమిటీ సభ్యులు మాట్లాడుతూ హిందూ బంధువులందరికీ ఏకతాటి మీదికి రావాలని హిందువుల మీద జరుగుతున్న అరాచకాలు దాడులు తిప్పుకొట్టాలని శ్రీ హనుమాన్ స్వామి ధైర్యం,భక్తితో యువత అచంచల విశ్వాసం,శక్తి,నిబద్ధతను అలవర్చుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని,హనుమాన్ ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతోఉండాలని,సమాజంలో ఐక్యత,ధర్మం నిలవాలంటే హనుమాన్ ఆశీస్సులు అవసరమని ధర్మ రక్షణ సమితి సభ్యులు అన్నారు.ఈ కార్యక్రమంలో చర్ల మండల హిందూ బంధువులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.











