*జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ని కలిసిన సర్పంచ్ బెల్లి స్వప్న శ్రీనివాస్ యాదవ్*

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 03:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలోని అగర్మియాగూడ గ్రామ సర్పంచ్ స్వప్న శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. లేమూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది అన్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. లేమరు మాజీ సర్పంచ్ గూడూరు కొండారెడ్డి మరియు అగర్మియాగూడ గ్రామ సర్పంచ్ బెల్లి స్వప్న శ్రీనివాస్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ని ప్రత్యేకంగా ఆహ్వానించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అనంతరం లేమూరులోని వి6 బండ నవీన్, కుమార్తె అకాల మరణం చెందడం పట్ల వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది అని అగర్మియాగూడ గ్రామ సర్పంచ్ సప్న శ్రీనివాస్ యాదవ్,పత్రిక విలేకరులకు తెలియజేశారు











