దైనందిన మానవ జీవన విధానంలో యోగ చాలా అవసరం……

హాలియా మున్సిపాలిటీ……. చైర్మెన్ చింతల చంద్రారెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:05
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక (99) రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా హాలియా మున్సిపాలిటీలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలిక విద్యాలయం లో ఘనంగా హ్యాపీ సండే – ఫన్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఇందులో భాగంగా ప్రముఖ యోగ గురువు సైదులు చే యోగాసనాలు, ప్రాణయామం, సూర్య నమస్కారాలు చేయించారు.
అదేవిధంగా హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మాట్లాడుతూ దైనందిన మానవ జీవన విధానంలో యోగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా హాలియా మున్సిపల్ కమిషనర్ కే రవీందర్ రెడ్డి 2 వ వార్డ్ కౌన్సిలర్ సలహాదారు నకిరేకంటి సైదులు,8 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు మజార్ మొయినుద్దీన్, 10 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు పిల్లి ఆంజనేయులు, 12 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు ఎడవల్లి రంజిత్ , బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, టీచింగ్ స్టాప్ , సురభి రాంబాబు , కార్యాలయ సిబ్బంది, ఆర్పీలు, మరియు పట్టణ పుర ప్రముఖులు మున్సిపల్ సిబ్బంది, విద్యార్థునిలు మొదలగు వారు పాల్గొని ఈ హ్యాపీ సండే – ఫన్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.











