E-PAPER

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

05 Apr 2026, 7:32 pm DISHA POWER

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

--సామాజిక న్యాయ పోరాట యోధుడికి నివాళులు

ప్రజా గొంతుక ఏప్రిల్ 5, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ సమీపంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు పుట్ట ప్రశాంత్ మాదిగ ఆధ్వర్యం వహించారు.

ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు గంగారపు శ్రీనివాస్ మాదిగ, ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి, గ్రామ సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలీయా పాల్గొన్నారు. ముందుగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం నిర్వహించిన సభలో గంగారపు శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా దేశానికి అపూర్వ సేవలు అందించారని కొనియాడారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానేతగా గుర్తింపు పొందారని అన్నారు. పార్లమెంట్‌లో నాలుగు దశాబ్దాలకు పైగా వివిధ శాఖల్లో మంత్రిగా సేవలందించి ఉప ప్రధానిగా దేశ సేవలో నిలిచారని వివరించారు.

1946లో జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టి, కార్మిక హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. 1971 యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా వ్యవహరించి దేశానికి సేవలందించారని తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, హరిత విప్లవం విజయవంతం కావడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు.

ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి, పుట్ట ప్రదీప్, గంగారపు శ్యామ్, పుట్ట ప్రణయభాస్కర్, పుట్ట జ్ఞానరాజ్, పుట్ట చైతన్య, పల్లెపెల్లి అనిల్, చింత తిలక్, మేకల రాజు, కొట్టె ప్రణయభాస్కర్, కొట్టె అనుచరణ్, కొట్టె దేవరాజు, కొట్టె రవి, పొలుమారి రాజు, మాచెర్ల పౌలు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

–సామాజిక న్యాయ పోరాట యోధుడికి నివాళులు

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!