ఏసీబీ వలలో విద్యాశాఖాధికారులు
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 08 ఏప్రిల్ 2026
పింఛను పత్రాలు సిద్ధం చేసేందుకు పదిహేను వేల రూపాయలు లంచం తీసుకుంటూ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల విద్యాశాఖాధికారి, అయోధ్యపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె.రవికుమార్, అదే పాఠశాల సహాయకుడు జి.చంద్రమౌళి బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. గూడూరు పాఠశాల ఆవరణలో బాధితుడి నుంచి లంచం స్వీకరిస్తుండగా వరంగల్ దర్యాప్తు అధికారులు వలపన్ని పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి వరంగల్ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Post Views: 47











