*డి హెచ్ పి ఎస్ మహాసభలను విజయవంతం చేయండి*
ప్రజా గొంతుక న్యూస్ ఎల్కతుర్తి:
దళిత హక్కుల పోరాట సమితి (DHPS) రెండవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఎల్కతుర్తి మండలంలో బుధవారం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డి హెచ్ పి ఎస్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల మనోహర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన 76 సంవత్సరాలు గడిచినా దళితులు ఇంకా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బడ్జెట్లో దళితులకు 20 శాతం నిధులు కేటాయించాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో సూచించినప్పటికీ అమలులో లోపాలు ఉన్నాయని అన్నారు.దళితులకు కేటాయించాల్సిన నిధులు ఇతర శాఖలకు మళ్లిస్తున్నారని ఆరోపిస్తూ ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇల్లు లేని దళితులకు ఇందిరమ్మ ఇళ్లలో 50 శాతం వాటా పారదర్శకంగా కల్పించాలని కోరారు.
ఏప్రిల్ 17 18 తేదీలలో వరంగల్ లో జరిగే డి హెచ్ పి ఎస్ రెండవ రాష్ట్ర మహాసభలకు హనుమకొండ జిల్లా గ్రామ మండల స్థాయి నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మరి శ్రీనివాస్, శనిగరపు రాజకుమార్ తాండ ముండయ్య ప్రకాష్ రాజు కొమురయ్య తదితరులు పాల్గొన్నారు











