అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ చేసిన
అలంపూర్,శాసనసభ్యులు విజయుడు.
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.
జోగులాంబగద్వాలజిల్లాఅలంపూర్,నియోజకవర్గo లో అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి మరియు,పౌష్టికాహారపంపిణీనిమరింతసమర్థవంతంగాపర్యవేక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు.ఆలంపూర్,నియోజకవర్గంలోనిఉండవెల్లి,అయిజ,మానవపాడు,అలంపూర్,మరియుఎర్రవల్లి మండలాల్లోని వివిధ గ్రామాల్లోవిధులునిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లకుఆయనబుధవారం 226 మొబైల్ ఫోన్లనుపంపిణీచేశారు.ఈసందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ,అంగన్వాడీటీచర్లునిత్యంక్షేత్రస్థాయిలోఉంటూగర్భిణీలు,బాలింతలు,కిశోర బాలికలు,విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందేలాచూడాలనిఆయనపిలుపునిచ్చారు. అంగన్వాడీకేంద్రాలద్వారా అందుతున్న సేవలనుప్రజలకుమరింత చేరువ చేయాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.











