*మస్కతి బాదం మిల్క్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు… మహేశ్వరంలో వినియోగదారుడికి షాక్*

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 09:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం పట్టణంలో మస్కతి కంపెనీకి చెందిన బాదాం మిల్క్ బాటిల్లో ప్లాస్టిక్ ముక్క బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. శివ మొబైల్ షాప్ ఓనర్ ఆకుల శివకుమార్ అనారోగ్యంగా ఉండటంతో తన షాపు పక్కన ఉన్న ఒక స్వీట్ హౌస్ నుండి మస్కతి బాదం మిల్క్ తెప్పించి తాగాడు. అయితే బాటిల్లో సుమారు డెబ్బై శాతం తాగిన తర్వాత దాని లోపల ఉన్న గట్టి ప్లాస్టిక్ ముక్క బయటకు రావడంతో షాక్‌కు గురయ్యాడు.
అభ్యంతరం వ్యక్తం చేసిన వినియోగదారుడు మొత్తం బాటిల్‌ను పరిశీలించగా ఒక స్పష్టమైన ప్లాస్టిక్ చెత్త ముక్క కనిపించింది. వెంటనే స్వీట్ హౌస్ నుండి మస్కతి సేల్స్‌మ్యాన్ ఫోన్ నంబర్ తీసుకుని సమస్యను వివరించగా, సేల్స్‌మ్యాన్ ఇది ప్యాకింగ్ లోపం కావచ్చని, క్షమించాల్సిందిగా కోరుతూ ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పినట్లు సమాచారం.
కానీ ఈ సంఘటన చిన్నపిల్లలు లేదా వృద్ధులు తాగినపుడు గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉండి ప్రాణాపాయానికి దారి తీసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నాణ్యత లోపాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.











