*న్యాయస్థానం స్వర్గీయ మహాత్మ జ్యోతిబా పూలే జయంతి దేవరకొండ*
*ప్రజా గొంతుక ఏప్రిల్ 11 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*
స్వర్గీయ మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు ఘనంగా దేవరకొండ న్యాయస్థానంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి కె అనిత మరియు బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శిలు సన్నాయిల ఉమామహేశ్వర్, వనం జగదీశ్వర్ పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు, సందర్భంగా జడ్జ్ మాట్లాడుతూ స్వర్గీయ మహాత్మా జ్యోతిబా ఫూలే మహారాష్ట్ర లో తేది: 11-04-1827న పూణేలోని ఒక తోటమాలి కుటుంబంలో జన్మించి 1890 నవంబర్ 28న స్వర్గస్తులైనారు.
అతను విద్యను 1847లో తన చదువును పూర్తి చేసి, మార్గదర్శక, భారతీయ సంఘ సంస్కర్త, మేధావి అంటరానితనాన్ని నిర్మూలించడానికి, కుల వ్యవస్థను రద్దు చేయడానికి, మరియు విద్య ద్వారా మహిళలు మరియు అణగారిన వర్గాల సాధికారతకు తన జీవితాన్ని అంకితం చేశారు.🪷🪷
అతని తన భార్య సావిత్రిబాయి ఫూలేతో కలిసి 1848లో భారతదేశపు మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి, వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించారు.
1848లో, ఆయన మరియు ఆయన భార్య సావిత్రిబాయి కలసి సామాజిక కట్టుబాట్లను ధిక్కరిస్తూ, పూణేలో బాలికల కోసం మొట్టమొదటి స్వదేశీయులచే నడపబడే పాఠశాలను స్థాపించారు
1873లో దళితులు, శూద్రులు మరియు మహిళల హక్కుల కోసం ప్రచారం చేయడానికి ఆయన సత్యశోధక్ సమాజ్ అను సత్య అన్వేషకుల సంఘంను స్థాపించారు. ఆయన బాల్య వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించారు, వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చారు, మరియు అంటరానివారితో సహా అందరి కోసం ఒక ఉమ్మడి స్నానాల తొట్టిని ఏర్పాటు, వితంతువుల కోసం ఒక గృహాన్ని స్థాపించారు, యువ వితంతువులకు విద్యను అందించారు మరియు వారి పిల్లల కోసం ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రచనలు,సాహిత్యం ప్రభావవంతమైన పుస్తకంలో కుల వ్యవస్థను ఖండించారు.
ముఖ్యంగా మహాత్మా బిరుదు ఆయన చేసిన అవిశ్రాంత కృషికి గాను 1888లో ఆయనకు “మహాత్మా” (గొప్ప ఆత్మ) అనే బిరుదుతో సత్కరించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై గొప్ప ప్రభావాన్ని చూపారు. అంబేద్కర్ గారు ఫూలేను తన గురువులలో ఒకరిగా భావించేవారు.
ఆయన వారసత్వం భారతదేశంలోని సామాజిక న్యాయ ఉద్యమాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. కావున వారి అడుగుజాడల్లో ఉంటూ దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
ఈనాటి కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ఎండి శౌకత్ అలీ, వస్కుల శ్రీనివాస్, ఈడెం రవి కుమార్, శంకర్, రామస్వామి, కృష్ణ, సాయి, షణ్ముఖ, శ్రీరామ్, ఆంజనేయులు, రాజశేఖర్, రాజ్ కుమార్, రమేష్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు











