రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించాలి
ప్రజా గొంతుక ఏప్రిల్ 11 స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ ప్రతినిధి:
రైతులు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. వేలేరు మండల కేంద్రంలో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కజొన్న రైతులు ఎకరానికి భారీగా నష్టపోతున్నారని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా వారికి న్యాయం జరుగుతుందని అన్నారు. రైతులు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాల కేటాయింపుతో వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బిల్లా యాదగిరి పిడి డిఆర్ డిఎ, శ్రీనివాస్, సివిల్ సప్లై డిఎం, వ్యవసాయ శాఖ అధికారులు వివిధ గ్రామ సర్పంచులు తాసిల్దార్ ఎంపీడీవో మండల నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు…











