E-PAPER

మైనర్లకు వాహనాలిస్తే యజమానులదే బాధ్యత

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మైనర్లకు వాహనాలిస్తే యజమానులదే బాధ్యత

13 Apr 2026, 3:12 pm DISHA POWER

మైనర్లకు వాహనాలిస్తే యజమానులదే బాధ్యత

రుద్రంపూర్ గ్రామసభలో టూ టౌన్ సీఐ డి. ప్రతాప్ హెచ్చరిక

ప్రజా గొంతుక న్యూస్, ఏప్రిల్ 13/ భద్రాద్రి కొత్తగూడెం: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రోడ్డు భద్రత వారోత్సవాల ను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ కేస్లి అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభకు కొత్తగూడెం టూ టౌన్ సీఐ డి. ప్రతాప్ ముఖ్య అతిథిగా విచ్చేసి, ట్రాఫిక్ నిబంధనలపై గ్రామస్తులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా సీఐ ప్రతాప్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని పిలుపునిచ్చారు.

చిన్న పిల్లలకు వాహనాలు ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడిపితే పిల్లలతో పాటు వాహన యజమానులను కూడా నేరస్తులుగా పరిగణించి కఠిన శిక్షలు విధిస్తామని స్పష్టం చేశారు.

నాణ్యత లేని హెల్మెట్లు వాడటం వల్ల ప్రయోజనం ఉండదని, విధిగా ఐఎస్ఐ ముద్ర కలిగిన నాణ్యమైన హెల్మెట్లను మాత్రమే ధరించాలని సూచించారు.

"ఒక కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో మరణిస్తే, ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా కన్నీటి పర్వతంలో మునిగిపోతుంది. మీ చిన్న పొరపాటు వల్ల మీతో పాటు ఎదుటివారు కూడా బలైపోయే ప్రమాదం ఉంది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

"రోడ్డు భద్రత నియమాలు కేవలం చట్టం కోసం కాదు, మీ ప్రాణాల రక్షణ కోసం. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వాహనాలు నడిపి సురక్షితంగా ఇంటికి చేరాలి."

ఈ అవగాహన సదస్సులో సర్పంచ్ బానోత్ కేస్లీ ఉప సర్పంచ్ తోటరాజు , పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీ, పంచాయతీ సెక్రటరీ నరేందర్, ఎస్సై మనిషా, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Generating image…

“ఒక కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో మరణిస్తే, ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా కన్నీటి పర్వతంలో మునిగిపోతుంది. మీ చిన్న పొరపాటు వల్ల మీతో పాటు ఎదుటివారు కూడా బలైపోయే ప్రమాదం ఉంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

“రోడ్డు భద్రత నియమాలు కేవలం చట్టం కోసం కాదు, మీ ప్రాణాల రక్షణ కోసం. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వాహనాలు నడిపి సురక్షితంగా ఇంటికి చేరాలి.”

ఈ అవగాహన సదస్సులో సర్పంచ్ బానోత్ కేస్లీ ఉప సర్పంచ్ తోటరాజు , పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీ, పంచాయతీ సెక్రటరీ నరేందర్, ఎస్సై మనిషా, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

మైనర్లకు వాహనాలిస్తే యజమానులదే బాధ్యత

మైనర్లకు వాహనాలిస్తే యజమానులదే బాధ్యత

రుద్రంపూర్ గ్రామసభలో టూ టౌన్ సీఐ డి. ప్రతాప్ హెచ్చరిక

ప్రజా గొంతుక న్యూస్, ఏప్రిల్ 13/ భద్రాద్రి కొత్తగూడెం: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రోడ్డు భద్రత వారోత్సవాల ను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ కేస్లి అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభకు కొత్తగూడెం టూ టౌన్ సీఐ డి. ప్రతాప్ ముఖ్య అతిథిగా విచ్చేసి, ట్రాఫిక్ నిబంధనలపై గ్రామస్తులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా సీఐ ప్రతాప్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని పిలుపునిచ్చారు.

చిన్న పిల్లలకు వాహనాలు ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడిపితే పిల్లలతో పాటు వాహన యజమానులను కూడా నేరస్తులుగా పరిగణించి కఠిన శిక్షలు విధిస్తామని స్పష్టం చేశారు.

నాణ్యత లేని హెల్మెట్లు వాడటం వల్ల ప్రయోజనం ఉండదని, విధిగా ఐఎస్ఐ ముద్ర కలిగిన నాణ్యమైన హెల్మెట్లను మాత్రమే ధరించాలని సూచించారు.

"ఒక కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో మరణిస్తే, ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా కన్నీటి పర్వతంలో మునిగిపోతుంది. మీ చిన్న పొరపాటు వల్ల మీతో పాటు ఎదుటివారు కూడా బలైపోయే ప్రమాదం ఉంది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

"రోడ్డు భద్రత నియమాలు కేవలం చట్టం కోసం కాదు, మీ ప్రాణాల రక్షణ కోసం. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వాహనాలు నడిపి సురక్షితంగా ఇంటికి చేరాలి."

ఈ అవగాహన సదస్సులో సర్పంచ్ బానోత్ కేస్లీ ఉప సర్పంచ్ తోటరాజు , పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీ, పంచాయతీ సెక్రటరీ నరేందర్, ఎస్సై మనిషా, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!