*పులిమామిడి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 14:)*
*రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో పులిమామిడి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.సామాజిక న్యాయం, సమానత్వం, ధర్మం వంటి విలువలను ప్రపంచానికి చాటి చెప్పి, ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామపంచాయతీ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు, యువకులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.*
Post Views: 34











