*స్వర్ణ భారత్ ట్రస్ట్ ముచింతల్ లో డైరీ ఫార్మింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉచిత శిక్షణ శిబిరం*
*సొసైటీ ఫర్ ఎకనామికల్ డెవలప్మెంట్ రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ షేక్ హాజీ బాబా*
*(ప్రజాగొంతుక మహేశ్వరం ఏప్రిల్ 24:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలో సొసైటీ ఫర్ ఎకనామికల్ డెవలప్మెంట్ రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ షేక్ హాజీ బాబా మాట్లాడుతూ..
యూనియన్ ఆర్ సి టి, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ మరియు స్వర్ణ భారత్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డైరీ ఫార్మింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2026 ఏప్రిల్ 27 వ తేదీ నుండి ప్రారంభమవుతుందని 12 రోజులు ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలియజేయడం మాకు ఆనందంగా ఉంది.
ఈ కోర్సులో పాల్గొనే వారికి క్రింది అంశాలపై సమగ్ర శిక్షణ అందించబడుతుంది:
పాడి పరిశ్రమ అభివృద్ధి
పశువులలో వచ్చే వ్యాధులు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,
మంచి పశువులను ఎంచుకునే విధానం
అధిక నాణ్యత గల పాల దిగుబడి కోసం తీసుకోవాల్సిన చర్యలు,
దూడల సంరక్షణ,
పశువులకు సరైన పోషకాహారం ఇవ్వడం
పశువుల వ్యర్థాల నుంచి కంపోస్ట్ తయారీ
సేంద్రియ వ్యవసాయం పై అవగాహన
ఈ ట్రైనింగ్ మొత్తం 12 రోజుల పాటు నిపుణుల సమక్షంలో నిర్వహించబడుతుంది. కోర్సు ముగిసిన తర్వాత పరీక్ష నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ అందజేయబడుతుంది.
ఈ సర్టిఫికెట్ ఆధారంగా పిఎంఈజీపి లోన్ పొందేందుకు అర్హత లభిస్తుంది. ముఖ్యంగా, ప్రభుత్వం 35% సబ్సిడీతో స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహిస్తోంది.ఈ అవకాశాన్ని గ్రామీణ యువత వినియోగించుకొని, మంచి స్థిరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
సమర్పించవలసిన పత్రాలు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, రేషన్ కార్డు జిరాక్స్ కాపీ, పదవ తరగతి మెమో జిరాక్స్ ,నాలుగు పాస్పోర్ట్ సైజు ఫొటోస్, సమర్పించవలెను
వయోపరిమితి 18 సంవత్సరాలు నిండి మరియు 50 సంవత్సరాలు లోపు ఉండవలెను.సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:- 93914 87797 కోఆర్డినేటర్ డైరీ ఫార్మింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉచిత శిక్షణ శిబిరం ఇట్లు
*సొసైటీ ఫర్ ఎకనామికల్ డెవలప్మెంట్ రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ షేక్ హాజీ బాబా*











