*నూతనంగా ఎన్నికైన దేవరకొండ మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యులను శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే *నేనావత్ బాలు నాయక్*
*ప్రజా గొంతుక ఏప్రిల్ 28 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*
మున్సిపాలిటీ కో ఆప్షన్ ఎన్నికను పురపాలిక కార్యాలయంలో చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, కమీషనర్ పూర్ణ చందర్ గారి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం మరియు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో పాల్గొని,నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేవరకొండ మున్సిపాలిటీ నాలుగురు కో ఆప్షన్ సభ్యులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
*మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ* ఎన్నికైన సభ్యులు దేవరకొండ పట్టణ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై కౌన్సిల్ సభ్యులకు సలహాలు సూచనలు అందజేయాలని కోరారు.
కాంగ్రెస్ తరుపున బరిలో నిలిచిన నాలుగురు కోఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా విజయం సాధించడంతో తమ పాలకవర్గానికి మరింత బలం చేకూరిందని తెలిపారు.
ఎన్నికల్లో 12 మంది కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యులతోపాటు ఆరుగురు బీఆర్‌ఎస్ సభ్యులు, ఒక్కరు ఇండిపెండెంట్, ఒక్కరు బీజేపీ కూడా మద్దతు తెలుపుతూ చేయి ఎత్తి బలపరచడంతో నాలుగు స్థానాలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కైవసం చేసుకుంది.
1. జనరల్ (జనరల్) – గార్లపాటి దామోదర్ S/o శివ లింగం
2. జనరల్ (మహిళా) – నేతాళ్ళ భాగ్యలక్ష్మి W/o శ్రీనివాసులు
3. మైనారిటీ (జనరల్) – MD. మైనోద్దిన్ S/o అమిరోద్దిన్
4. మైనారిటీ (మహిళా) – ఏకుల శిపోరమ్మ W/o సుదర్శన్
సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించాలని కో ఆప్షన్ సభ్యులను సూచించారు.
దేవరకొండ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన సభ్యులందరికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజా సేవలో మీ అనుభవం, నిబద్ధత దేవరకొండ పట్టణ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ఆకాంక్షించారు.
దేవరకొండ మున్సిపాలిటీలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, స్వచ్ఛత, పారదర్శక పాలన కోసం మీరు చిత్తశుద్ధితో కృషి చేస్తారని నమ్ముతున్నాను.
దేవరకొండ అభివృద్ధి పథంలో మీరు ముందుకు సాగేందుకు నా సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది.
మనందరం ఐక్యతతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం.
మీ భవిష్యత్ కార్యక్రమాలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్, మున్సిపల్ ఛైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.











