మహేశ్వరం మోడల్ స్కూల్ విద్యార్థుల ఘన విజయం
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 29:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలో..పదవ తరగతి ఫలితాల్లో మహేశ్వరం మోడల్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. మొత్తం 108 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 93 మంది ఉత్తీర్ణులయ్యారు.
పాఠశాలలో కొర్ర అక్ష 549 మార్కులతో ప్రథమ స్థానాన్ని సాధించి టాపర్‌గా నిలిచింది. అలాగే ఏడుగురు విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. భాషమోని శివాని 532, చెన్నం ఈనోశ్ 525, వడ్త్య యశోద 507, ఇస్లావత్ గాయత్రి 507, పాలోజీ బిందు శ్రీ 507, కుమ్మరి దీక్షిత 506 మార్కులు సాధించి మెరుగైన ఫలితాలు నమోదు చేశారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ గోపి మరియు ఉపాధ్యాయులు అభినందించారు.
Post Views: 34











