*రైతు వారోత్సవాల్లో పాల్గొన్న సింగల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి*

రైతు సంక్షేమానికి తెలంగాణ సర్కార్ పెద్దపీట వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతి పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సింగల్ విండో అధ్యక్షులు ఎస్ తిమ్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జరిగిన రైతు వారోత్సవాల్లో సింగల్ విండో చైర్మన్ శేషంపల్లి తిమ్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2 లక్షల రూపాయల రుణమాఫీ, సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్, రైతు భరోసా, ఉచిత విద్యుత్, పంటల మద్దతు ధరలు వంటి పథకాలు రైతులకు అండగా నిలుస్తున్నాయని వివరించారు. రైతు వేదికలు రైతుల సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమైన వేదికలని, ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి పథకం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించబడిందని ఆయన పేర్కొన్నారు.
మండల వ్యవసాయ శాఖ అధికారి కె రాజశేఖర్ మాట్లాడుతూ… భూసార పరీక్షలు… దాని ఉపయోగాలు, నానో యూరియా ఉపయోగించే విధానం, ఉపయోగాలు వరి, పత్తిలో మేలైన విత్తన రకాల ఎంపిక వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ ఆఫీసర్ విజయభాస్కర్ రెడ్డి, సింగల్ విండో వైస్ చైర్మన్ కె విష్ణు, సీఈఓ కిరణ్, మాజీ వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న, ఆలయ చైర్మన్ ప్రహ్లాద రావు, మాజీ సర్పంచ్ ప్రతాప్, ఏఈఓ లు రాహుల్, నిహారిక, మేఘన, సోనియా, జోష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.











