మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన సందర్భంగా రక్త దానం:ప్రజా గొంతుక మే 8 ఎల్కతుర్తి :

గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రి లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని.
ఎర్రోళ్ల చైతన్య యువజన కాంగ్రెస్ హుస్నాబాద్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మరియు
యువజన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేయడమైనది
ఈ సందర్భంగా ఎర్రోళ్ల చైతన్య మాట్లాడుతూ ప్రజాసేవలో రక్తదానం అత్యున్నతమైన సేవ అన్నిటికన్నా గొప్ప దానం రక్తదానం.ఒకరి ప్రాణాలను కాపాడిన వాళ్లు అవుతారని పేర్కొన్నారు
అలాగే సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంచుకొని అవసరమైన సమయంలో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాసేవలో మీ ప్రయాణం ఇలాగే విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటూ మీరు ఆయురోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.











