మూగజీవాల అక్రమ రవాణాపై పోలీస్ నిఘా…
మూగజీవాల పట్టివేత — ముగ్గురిపై కేసు నమోదు
మన సాక్షి గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఇటుకలపల్లి గ్రామ శివారులో గోవులు, ఎద్దులను అక్రమంగా హైదరాబాద్ కబేళాకు తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్, పోలీసు తనిఖీలు నిర్వహించగా, కబేళాకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 3 ఆవులు, 6 ఎద్దులను గుర్తించి, ఒక అశోక్ లేలాండ్ దోస్త్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులైన నజీర్, ఉస్మాన్, రౌఫ్‌లపై కేసు నమోదు చేశారు.నిందితుడు నజీర్‌పై గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదు అయినట్లు గుర్తించారు.రక్షించబడిన మూగజీవాలను సంరక్షణ నిమిత్తం కొలనుపాక జైన్ ట్రస్ట్ వారి గోశాలకు తరలించారు. అనంతరం బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ,మూగజీవాల అక్రమ రవాణా నిషేధించబడినది. కావున ఇలాంటి అక్రమ రవాణాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకుతెలియజేయవలసిందిగా మండల ప్రజలకు బచ్చన్నపేట పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు.











