డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఓ వ్యక్తికి వారం రోజుల జైలు శిక్ష.
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కేంద్రంలో ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలు నిర్వహించగా అధిక మోతాదులో మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడిపిన చినరామంచర్ల గ్రామానికి చెందిన దర్శనం ఆంజనేయులు ని కోర్టులో హాజరు పరచగా జనగాం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సందీప వారం రోజుల జైలు శిక్ష విధించారు. సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం కాకూడదని, బచ్చన్నపేట పరిధిలో నిరంతరం వాహన తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రమాదాలను కొనితెచ్చుకోవడమే కాకుండా, కేసులకు పాల్పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఈ సందర్భంగా మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Post Views: 217











