*ఆర్థిక సహయం అందజేత
ప్రజా గొంతుక ప్రతినిధి / శాయంపేట (మే14):
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కందగట్ల నరహరి ఇటీవల మృతి చెందినాడు.విషయం తెలుసుకున్న పలువురు చలించిపోయి 5500 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 50 కేజీల బియ్యాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి రాజిరెడ్డి, వార్డ్ మెంబర్ కందగట్ల ప్రవీణ్ కుమార్,గడ్డి రవి, రావుల తిరుపతి, వంగ రమేష్, వంగ అశోక్, పల్లెబోయిన శ్రీనివాస్, దండే పోయిన కట్టయ్య,అన్నేబోయిన వెంకటేష్, బాబు రాజు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 26











