ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలు
విద్యార్థులను సత్కరించిన సర్పంచ్ పొనగంటి శ్వేత శ్రీనివాస్
ప్రజా గొంతుక,ఎల్కతుర్తి, మే 17 ,హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్ లొ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల సందర్భంగా వల్లభాపురం పాఠశాలలో విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ తరగతి ఫలితాలలో మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన డి. కావ్యశ్రీ, ద్వితీయ స్థానం పొందిన ఎ. వైష్ణవి విద్యార్థినులను గ్రామ సర్పంచ్ పొనగంటి శ్వేత, శ్రీనివాస్, ఉప సర్పంచ్ అంబాల అనిల్ కుమార్ ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థినుల ప్రతిభ పాఠశాలకు, గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు.క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల విజయాల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమని కొనియాడారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. టాపర్ల విజయాన్ని అందరూ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.











